అవంతిక’ టీజర్ విడుదల చేసిన మన్మథుడు 2 బృంధం….

308
avanthika and manmadudu teasers release
avanthika and manmadudu teasers release

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో రకుల్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో రకుల్‌ పేరు అవంతిక. టీజర్ విషయానికి వస్తే … ‘అవంతిక’ పేరు ఎంత వినసొంపుగా ఉంది… అంతే పద్దతి గల అమ్మాయి అని బామ్మ అంటుంది. ఐ లవ్ యూ ఆంటీ అను అవంతిక అంటుంది. ఆ అమ్మాయి చల్లని గాలి లాంటిది అని వెన్నెల కిషోర్ అంటారు. అంతలో వ్యంగంగా బోగేం కాదు అని నాగార్జున చెబుతాడు.

ఇంతలో రకుల్, నాగార్జు మధ్యలో కొన్ని హస్య చిత్రాలు ఉంచారు. మళ్ళీ నాగార్జున రెండు సంవత్సరాలుగా అమ్మాయి ప్రేమిస్తున్నా అనగానే రకల్ నవ్వుతూ ఈ వయసులో నువ్వు లవ్ ఫెల్యూర్ తట్టుకోలేవు అంటుంది. ఇప్పటి వరకు యూ సర్టిఫికెట్ ప్రయత్నించాను… ఇప్పుడు ఏ సర్టిఫికేట్ చూపిస్తా అంటూ తన కల్లలోకి చూడమని నాగార్జునకు రకుల్ సైగ చేస్తుంది. ఇంతలో రకుల్ సిగిరెట్ తాగే చిత్రాన్ని ప్రజెంట్ చేసి మన్మథుడు టైటిల్ ఉంచారు. ఇంతలో వెన్నెల కిషోర్ వచ్చి సచ్ ఏ డేంజరస్ బేబీ.. ఐలవ్ యూ మోర్ అంటూ వెల్లిపోతాడు. ఈ మొత్తం టీజర్ నిడివి 1 నిమిషం 5 సెంకడ్లుగా విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here