మళ్ళీ 28 ఏళ్ల తర్వాత ఆ పనిచేయబోతున్న వెంకటేష్..!!

193

విక్టరీ వెంకటేష్, టబు జంటగా కూలీ నెం.1 సినిమాలో నటించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాతోనే టబు టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.. తర్వాత స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. 28 ఏళ్ల తర్వాత టబు మళ్లీ వెంకీతో జతకట్టబోతుందని తెలుస్తుంది.

అజయ్ దేవ్‌గణ్, టబు, రకుల్ ప్రీత్ నటించిన ‘దే దే ప్యార్ దే’ ఇటీవల విడుదలై విజయం సాధించింది. అజయ్, టబు భార్యాభర్తలుగా నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటించనున్నాడు. అతనికి జోడీగా టబు నటించనుంది.

దే దే ప్యార్ దే లో చేసిన క్యారెక్టరే టబు తెలుగులోనూ చెయ్యనుందని, మూవీ టీమ్ ఆమెని కాంటాక్ట్ చెయ్యగా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.. వెంకటేష్ నటిస్తున్న వెంకీమామ విడుదలైన తర్వాత ఈ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here