ఆ క్రికెటర్ తో అనుపమ ప్రేమాయణం..!!

187

అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ అనే మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్‌‌తో సంబందం లేకుండా ఈ భామకు తెలుగులో భాగానే ఆఫర్స్ వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’లో అనుపమ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ భామ. ఇదిలా ఉంటె ప్రస్తుతం 2019 వరల్డ్ కప్‌లో తన పదునైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తున్న బూమ్రా.. మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఓరచూపులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఈ పుకార్లపై ఇప్పటివరకు అనుపమ కానీ, బుమ్రా కానీ స్పందించనప్పటికీ వీటిని కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు మాత్రం కొట్టిపారేస్తున్నారు. సెలెబ్రిటీలు కూడా మనుషులేనని, వారికి కూడా కొంత ప్రైవేట్ లైఫ్ ఉంటుందని, ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజామా, కాదా అనే విషయమై ఇంత రాద్ధాంతం చేయడం సరైనది కాదని, అలా వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సమంజసం కాదని కొందరు నెటిజన్లు వారిద్దరికి మద్దతుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మరి ఈ పుకార్లపై వారిద్దరూ రాబోయే రోజుల్లో ఏవిధంగా స్పందిస్తారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here