చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ఆఫ‌ర్ అదిరింది.

323

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపక్ష తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు అలాగే టీడీపీ ఎమ్మెల్యేల‌కు బంపర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. తాజాగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో జ‌గ‌న్ మాట్లాడుతూ… వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌ను, అలాగే తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిక్షించేందుకు జ‌గ‌న్ మ‌రో కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు ప్ర‌తీ ఎమ్మెల్యేకు కోటి రపాయ‌లు కేటాయిస్తున్నామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఈ నిధుల‌తో ప్ర‌తీ ఎమ్మెల్యే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను అంచ‌నా వేసి వాటికి ప‌రిష్కారం దొరికేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరికిన త‌ర్వాత ఎమ్మెల్యేలకు కేటాయించిన సొమ్ముతో ప్ర‌జా స‌మ‌స్య‌ల నిమిత్తం ట్యాంక‌ర్ల‌ను ఏర్పాటు చేస్తారో, లేక బోర్లు వేయిస్తారో, ట్యాంక‌ర్ల‌ను రిపేర్ చేస్తారో వారి ఇష్టం కానీ తాగునీటి స‌మ‌స్య మాత్రం రాష్ట్రంలో ఉండ‌కూడ‌ని జ‌గ‌న్ అన్నారు. ఈ కోటి రూపాయ‌లు కేవ‌లం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు మాత్ర‌మే కాద‌ని టీడీపీ ఎమ్మెల్యేల‌కు కూడా ఇస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు.

వీరు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల స‌మ్య‌ల‌ను తీర్చాల‌ని అన్నారు. ఎమ్మెల్యేలందరికీ ప్ర‌భుత్వం తోడుగా ఉంటుంద‌ని అన్నారు. ఇంత‌కు ముందు టీడీపీ హ‌యాంలో తాగు నీటి స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు ఒక్క కార్య‌క్ర‌మం కూడా చేయ‌లేద‌ని అస‌లు తాను ఎక్క‌డా ఆలాంటి మాట‌లు విన‌లేద‌ని అన్నారు. అంతేకాదు ఏపీ సీఎం నిధుల‌కింద ప్ర‌తిప‌క్షనేత‌కు నిధులు కేటాయిస్తామ‌ని ఆయ‌న కూడా ఈ నిధుల‌తో త‌న నియోజ‌కవ‌ర్గంలో ప‌ర్య‌టించ‌వ‌చ్చ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here