జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌ స్వీకారం చేసిన వెంట‌నే మ‌రో కీల‌క నిర్ణ‌యం

42

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా నేడుప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీ టూరిజం కార్పోరేష‌న్ కు ఎండీగా ఉన్న కే. ద‌నుంజ‌య్ రెడ్డిని ఏపీ అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా నియ‌మించుకున్నారు. ఈమేర‌కు ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ఉత్త‌ర్వులు జారీ చేశారు. జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత ఆయ‌న ఈ ఫైళ్ల‌పై తొలి సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

ద‌నుంజ‌య‌రెడ్డ‌ గ‌తంలో వివిధ శాఖ‌ల్లో ప‌ని చేశారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లా క‌లెక్ట‌ర్ గా ద‌నుంజ‌య రెడ్డి విధులు నిర్వ‌హించారు. మే 23న ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన‌ప్ప‌టినుంచి ఆయ‌స జ‌గ‌న్ క్యాంప్ ఆఫీస్ వ‌ద్దే ఉన్నారు. కాగా ఈ రోజు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం ప్ర‌జా స‌మ‌క్షంలో అంగ‌రంగా వైభ‌వంగా నిర్వహాంచారు. ప్ర‌మాణ స్వీకారం అయిన త‌ర్వాత హిందు ముస్లిం, క్రిస్టియన్ ప‌ద్ద‌తుల్లో జ‌గ‌న్ కు ప్ర‌త్యేక ప్రార్థ‌నలు నిర్వ‌హించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here