ఇస్మార్ట్ శంకర్ మీదే పూరి బాలకృష్ణ సినిమా ఆధారపడి ఉందట..!!

425

ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమా రంగంలో కుర్ర హీరోల కంటే చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. గతంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పైసా వసూల్ అనే సినిమా చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఆ సమయంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరొకసారి పూరి జగన్నాథ్ తో కచ్చితంగా సినిమా చేస్తానని బాలకృష్ణ పేర్కొనడం జరిగింది.

అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా చేయడం జరిగింది. విడుదలకు సిద్ధంగా ఉంది ఈ నెల 18 వ తారీఖున విడుదల కానుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. అయితే తనతో సినిమా చేయాలంటే కచ్చితంగా హిట్ పడితేనే ఛాన్స్ ఉంటుందని ఇటీవల తన దగ్గరికి వస్తున్న డైరెక్టర్లతో బాలకృష్ణ చెప్పినట్లు సమాచారం.

ఇదే క్రమంలో కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన బోయపాటినే ఫామ్ లో లేడని బాలకృష్ణ పక్కనపెట్టేశాడు. వినయవిధేయ రామ రిలీజ్ కు ముందు ప్రాజెక్ట్ సెట్టయింది అనుకునే లోపే డిజాస్టర్ అనంతరం బ్రేక్ పడింది. ఇక బాలయ్యతో పని చేసిన మొదటిసారే డిజాస్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ని నమ్మాలంటే ఇస్మార్ట్ శంకర్ తో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టక తప్పదు. మరి పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో నైనా హిట్ కొడతాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here