బాలకృష్ణ సినిమా కి టైటిల్ ఫిక్స్..!!

199

యువరత్న నందమూరి బాలకృష్ణ మరో కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. తమిళ దర్శకుడు కేఎస్. రవికుమార్ – బాలయ్య కాంబినేషన్‌లో రానున్న రెండో చిత్రం ఇది. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారనే టాక్ ఫిల్మ్ నగరులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.కానీ ఈ టైటిల్ విషయంలో బాలకృష్ణ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారట.

అందువలన ‘క్రాంతి’ అనే టైటిల్ వైపు బాలకృష్ణ మొగ్గుచూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఆయన పాత్ర .. ‘టెంపర్’ లో ఎన్టీఆర్ పాత్ర తరహాలో ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here