రూ.5వేల కోసం పసిబిడ్డపై కిరాతకం…!!

347

కుటుంబంలో గొడవలు పెట్టుకుని ఆ కోపాన్ని అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులపై చూపుతున్నారు. పెద్దవారి మీద పగను పసిబిడ్డల మీ చూపించారు ఇద్దరు రాక్షసులు. రెండున్నరేళ్ల ఆడపిల్లను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. అలీగడ్‌లోని తపాల్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలిక కుటుంబసభ్యులు ఉంటున్నారు. వారు ఓ వ్యక్తి దగ్గర రూ.5వేలు అప్పు తీసుకున్నారు.

ఆ డబ్బుల కోసం ఆ వ్యక్తి బాలిక అంకుల్,తాతతో గొడవపడ్డాడు. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. అయితే, తన వద్ద డబ్బులు తీసుకుని తననే ఎదిరించారన్న కసితో అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. రెండున్నరేళ్ల పసిబిడ్డ మీద తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. మే 31న బాలికను కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆ బాలిక కళ్లు పీకేసి, చేతులు విరిచేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. బాలిక కనిపించకపోయేసరికి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో జూన్ 2న వారు ఉండే ప్రాంతానికి కొంచెం దూరంలో బాలిక మృతదేహం కనిపించింది. వీధికుక్కలు పీక్కుతింటున్న స్థితిలో ఆ మృతదేహాన్ని చూసిన స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే ఈ పని డబ్బులు అప్పు ఇఛ్చిన వ్యక్తే చేశాడని గ్రహించి అతన్ని చావబాది పోలీసులకు అప్పగించారు. పోలీస్ నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here