బ్రేకింగ్ చంద్ర‌బాబుపై మ‌రో పిటీష‌న్ ఆయ‌న ఎన్నిక చెల్ల‌దా…

415

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. ఇటీవ‌లే ఏపీలో హోరా హోరీగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు స‌రైన వివ‌రాలు ఇవ్వ‌లేద‌ని చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగ‌ర్ హైకోర్టులో పిటీష‌న్ వేశారు. 2014 ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన చంద్ర‌బాబు నాయుడు ఐదు సంవ‌త్స‌రాల పాటు ప‌ద‌విలో ఉండి…. ఆయ‌న తీసుకున్న జీతభత్య వివ‌రాలు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో స‌మ‌ర్పించ‌లేద‌ని విద్యాసాగ‌ర్ త‌న పిటీష‌న్ లో పేర్కొన్నారు.

వీటితో పాటు మ‌రికొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌ ఎన్నిక చెల్ల‌దని వారు అఫిడ‌విట్ లో స‌రైన వివ‌రాలు ఇవ్వ‌లేని పలువురు నేత‌లు పిటీష‌న్ దాఖ‌లు చేసిన చేసినసంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టులో పిటీష‌న్ వేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అలాగే 2014 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగి ప‌రాజ‌యంపాలు అయిన తిప్పేస్వామి అదే ఏడాది జూన్ లో ఎన్నిక‌ల ట్రైబ్యున‌ల్ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పీటీష‌న్ లో టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లుబాటు కానిదిగా పేర్కొంటూ త‌న‌ను మ‌డ‌క‌సిర‌ నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నికైట్లుగా ప్ర‌క‌టించాల‌ని కోరారు.ఇక తిప్పేస్వామి వాద‌న‌లు విన్న హైకోర్ట్ ఈరన్న‌ను ఎమ్మెల్యే ప‌ద‌వికి అన‌ర్హుడుగా ప్ర‌క‌టించి వైసీపీ అభ్య‌ర్థి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొన‌సాగుతార‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here