కేంద్ర‌మంత్రిగా జూ. ఎన్టీఆర్

821

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంటి కేంద్ర మంత్రి ప‌ద‌వి ఏంట‌ని అనుకుంటున్నారా ఏం చేద్దాం మ‌రి రాజ‌కీయాలు ఎప్పుడు ఏ మ‌లుపులు తిరుగుతాయే ఎవ‌రికీ అర్ధం కాదండోయ్. అందులోనూ మ‌న తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవస‌రం లేదు. ఎందుకుంటే మ‌న రాజ‌కీయ నాయ‌కులు రాత్రికి రాత్రే సొంత పార్టీల‌కు పంగ‌నామం పెట్టేస్తున్నారు.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే… ఈ వార్త నిజ‌మంటే క‌చ్చితంగా ఎవ‌రూ నమ్మ‌రు. ఎందుకంటే ఈ వార్త నిజంగానే నిజం కాదు కావున ఎవ‌రూ న‌మ్మ‌రు. మ‌రి ఇప్పుడు ఈ ర‌క‌మైన వార్త తెర‌పైకి ఎందుకు వ‌చ్చింద‌నేగా మీ సందేహం.?? అస‌లు విష‌యం తెలిస్తే నిజంగా మీరు షాక్ అవ్వాల్సిందే మ‌రి!!

రాజ‌కీయాలంటే నెటిజ‌న్ల‌కు నవ్వులాట‌గా మారింద‌డోయ్. గ‌తంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీజేపీతో చేతులు క‌ల‌ప‌బోతున్న‌ట్లు విశ్వ‌య‌నీయ వ‌ర్గాల స‌మాచారం అందిందంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెట్ట‌డంతో తెలుగు రాష్ట్ర రాజ‌కీయాలు చ‌ర్చ‌నీయాశంగా మారాయి.

ఇక ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ విష‌యంలో కూడా అదే జ‌రిగింది. రానున్న రోజుల్లో జూ. ఎన్టీఆర్ కు కేంద్రంలో బెర్త్ క‌న్ఫామ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయంటూ సంచ‌ల‌న వార్త సోష‌ల్ మీడియ‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి న‌టుడిగా బిజీగా ఉంటూ… రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఎన్టీఆర్ గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అలాంటి వార్త హ‌ల్ చ‌ల్ చేయ‌డం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here