సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి.. చంద్రబాబు డిమాండ్..!!

182

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రతిపక్ష నేత స్పందించారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి జరిగిన అవమానానికి సీఎం జగన్ క్షమాపణలు చెబితే, తాను ఇప్పుడు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘మీరు చేయాల్సిన పనులను మీరు చేస్తూ నీతులు చెప్పడం మంచిది కాదు రామచంద్రారెడ్డి గారూ’ అని హితవు పలికారు. ఓ ఎస్సీ ఎమ్మెల్యేను రైతు సదస్సుకు రాకుండా చేశారంటే ఎంత దౌర్జన్యం? ఒక ఎమ్మెల్యేను దబాయించే పరిస్థికి వచ్చారు. ఇదే రౌడీయిజం. మీరు(నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి) పత్రికా విలేకరిని బెదిరించారు. దానికి ముఖ్యమంత్రి జగన్ జవాబు చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here