టీడీఎల్పీ భేటీ లో చంద్రబాబు ఆసక్తికర మాటలు..!!

257

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివాసంలో ఈరోజు టీడీఎల్పీ సమావేశం జరిగింది.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

గత 15 రోజుల్లో అనంతపురం, ప్రకాశం జిల్లాలతోపాటు, గుంటూరు జిల్లాలోని గురజాల, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం గర్హనీయమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.

దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున ఏం చేయాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో ఎప్పుడేం జరుగుతుందో నేరుగా సమాచారం పంపాలని సూచించారు. కార్యకర్తల రక్షణకోసం ఓ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడదామని నేతలకు ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here