ఆ గ్రామంలో అందరి జుట్టు 6 నుండి 10 అడుగులు వారు వాడే చిట్కా ఇదే.

232

ప్రపంచంలోని చాలా దేశాల్లో ముఖ్యమైన ఆహరం బియ్యంతో వండిన అన్నమే.. మనకు రోజువారీ కావలసిన కేలరీలు అన్నంలో సగంపైగా లభిస్తాయి. బియ్యం కేవలం ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు అందాన్ని ప్రసాదించే వరం అనొచ్చు. శతాబ్దాలుగా, ఆసియా మహిళలు వారి ముఖం, శరీరం మరియు జుట్టును అందంగా అలంకరించేందుకు బియ్యం నీటిని ఉపయోగించేవారు.

చైనాలో హువాంగ్లూ గ్రామంలోని యావో జాతి మహిళలు తమ అందాన్ని ఇనుమడింప జేసుకోటానికి బియ్యం కడిగిన నీటిని వాడుతారు. అక్కడ సగటున ప్రతి మహిళ జుట్టు పొడవు 6 నుండి 10 అడుగుల వరకు ఉంటుంది. వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ విలేజ్ గా వీరి గ్రామం గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకుంది.

అయితే జుట్టు పొడవుగా పెరగటానికి వీరు వాడే చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం కడిగిన నీళ్ళని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. అలా చేయటం వలన జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిట్కా వాడి అందమైన జుట్టు మీ సొంతం చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here