పెళ్ళైన మొద‌టి రాత్రే టాలీవుడ్ ర‌చ‌యిత ప‌రార్

1445

హైద‌రాబాద్ లో ప్రేమ పేరుతో ఓ అమాయ‌క యువ‌తిని మోస‌గించాడు తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన ర‌చ‌యిత ర‌మ‌ణ గౌత‌మ్, ఓ యువ‌తిని ప్రేమించాన‌ని న‌మ్మించి స‌హ‌జీవ‌నం చేశాడు. ఆ స‌మ‌యంలో పెళ్ళి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేసి అందిన కాటికి న‌గ‌దును దోచుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆ యువ‌తి పెళ్ళిమాట ఎత్తేస‌రికి ముఖం చాటేశాడు ర‌మ‌ణ గౌత‌మ్.

దీంతో బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఆమె ఫిర్యాదుతో జైలుకు పోతాన‌నే భ‌యంతో కొద్దిరోజుల క్రితం గుళ్లో తాళిక‌ట్టాడు ర‌మ‌ణ. కాపురానికి వ‌చ్చే స‌రికి మొద‌టి రాత్రే చెప్పా పెట్ట‌కుండా ప‌రార‌య్యాడు ర‌మ‌ణ‌. దీంతో ఇదేమిట‌ని బాధితురాలు నిల‌దీస్తే నున్వు నాకు వ‌ద్ద‌ని ఆ మ‌రుస‌టి రోజే విడాకులు తీసుకుంటాన‌ని చెప్పాడు. ఇక చేసేదేమిలేక బాధితురాలు న్యాయంకోసం పోలీసులను ఆశ్ర‌యించింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీస్ అధికారులు కేసు న‌మోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here