గొంతు నొప్పి తగ్గ‌డానికి ఈ చిట్కాలు పాటించండి?

335

కాలం ఏదైనా వాతావ‌ర‌ణంలో మార్పు వ‌చ్చింది అంటే ప‌లు వ్యాధులు వ‌స్తూ ఉంటాయి…మనం బ‌య‌ట మంచినీరు తాగినా ఒక్కోసారి గొంతు నొప్పి బారిన ప‌డుతూ ఉంటాం.. సీజ‌న్ మారితే త‌ర‌చూ ఈ గొంతు నొప్పి బాధ వేధిస్తూ ఉంటుంది..గొంతులో నొప్పి, ఇన్‌ఫెక్ష‌న్‌, మంట‌, స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోవ‌డం వంటి ఇబ్బందులు అన్నీ దీంతో వ‌స్తాయి. ఇక త‌ల‌నొప్పి జ‌లుబు జ్వ‌రం భారిన ప‌డ‌తాం… అయితే ఈ గొంతు నొప్పి వ‌చ్చిన స‌మ‌యంలో ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిది… ఆ చిట్కాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ల‌వంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క‌, అల్లం వంటి ప‌దార్థాల‌ను వేసి టీ త‌యారు చేసుకుని వేడి వేడిగా తాగాలి. ఈ మ‌సాలా టీతో గొంతు నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్ నివారించ‌బ‌డుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఉన్నా పోతాయి.

గొంతు నొప్పి, ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటే ఓ బౌల్‌లో వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. ఆయా స‌మ‌స్య‌లకు చికెన్ సూప్ ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. అంతేకాదు, జ‌లుబు ఉన్నా పోతుంది. ఇది చాలా మంచి చిట్కా అనే చెప్పాలి. అలాగే ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్క‌ల‌ను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో చిక్క‌ని అల్లం ర‌సం వ‌స్తుంది. అప్పుడు ఆ ర‌సాన్ని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉండ‌గానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్ష‌ణాల్లో త‌గ్గుతుంది.
ఇక తుల‌సి ఆకులు వేసి తీసుకున్నా ఆ నీటి ద్రావ‌ణం కూడా గొంతు నొప్పిని త‌గ్గిస్తుంది.

ఇక పెరుగు గాని మ‌జ్జిగ కాని చ‌ల్ల‌గా ఉండ‌గా కాకుండా సాధార‌ణ వేడిగా ఉండ‌గానే తీసుకోవాలి ఇలా తీసుకుంటే గొంతు నొప్పి త‌గ్గుతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం, తేనెల‌ను క‌లుపుకుని తాగాలి… వీటిలో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు గొంతు నొప్పిని త‌గ్గిస్తాయి. ఇన్‌ఫెక్ష‌న్ల‌ను పోగొడ‌తాయి. జ‌లుబు కూడా త‌గ్గుతుంది. ఇకఅర‌టిపండు తిన‌కూడ‌దు అంటారు గొంతినొప్పి స‌మ‌యంలో అది అపోహ మాత్ర‌మే. మ‌రో చిట్కా కూడా ఉంది అర‌టిపండుతో…. క‌ప్పు ఓట్స్‌ను బాగా ఉడికించి అందులో అర‌టి పండు వేసి బాగా క‌ల‌పాలి. ఆ త‌ర్వాత ఆ మిశ్ర‌మాన్ని తినేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతు నొప్పి త‌గ్గుతుంది. ఇక మిరియాలు వేడివేడి పాల‌తో తీసుకుంటే గొంతు నొప్పి త‌గ్గుతుంది… అలాగే జ‌లుబు కూడా దూరం అవుతుంది… అందుకే ఈ చిట్కాలు పాటించి గొంతు నొప్పికి దూరంగా ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here