ఇప్పుడు చెప్పండి న‌ల‌భై ఏళ్ల అనుభ‌వమా..? న‌ల‌భై ఏళ్ల‌ జ‌గ‌నా..?

417

విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్రదేశ్ లో జ‌రిగిన మొదటి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనూహ్య ప‌రిణామాల అనంత‌రం తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేప‌ట్ట‌డం… వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిప‌క్ష హోదాతో స‌రిపెట్టుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విప‌రీత‌మైన ప్ర‌జాధార‌ణ ఉన్న‌ప్ప‌టికీ ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు చెప్పిన అన్ లిమిటెడ్ హామీల కార‌ణంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వంతో పోరాడే హోదా గ‌ల ప్ర‌తిప‌క్ష నేత‌గా బాధ్య‌త‌లు తీసుకోవాల్సి వ‌చ్చింది.

అయితే కొంత‌మంది మాత్రం రాష్ట్ర ప్ర‌జ‌లు, చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో నిర్వ‌ర్తించిన ముఖ్య‌మంత్రి అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకుని ఓట్లు వేశార‌ని చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప‌డిన ఓట్ల శాతాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే అది అక్ష‌రాల త‌ప్పు అనే విషయాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

అయితే 2019 ఎన్నిక‌లకు మూడు నెల‌ల ముందు రాష్ట్రంలో చోటు చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే మాత్రం… న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ ఉంద‌ని చెప్ప‌కుంటున్న చంద్ర‌బాబు, గ‌తంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఫాలో అయ్య‌రంటే మీరు న‌మ్ముతారా….? న‌మ్మాలి ఎందుకంటే ఇది నిజం కావున!!

2014 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని చంద్ర‌బాబు, వైయ‌స్ జ‌గ‌న్ ఇద్ద‌రూ కూడా హామీ ఇచ్చారు. కాని ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు హోదా అంశాన్ని ప‌క్క‌కు పెట్టి ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టి కేంద్రం ద‌గ్గ‌ర తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్ట‌డం ఒక ఎత్తు అయితే. ఎన్నిక‌ల స‌మయంలో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్లో కొన్ని అంశాల‌కు కాఫీ కొట్ట‌డం మ‌రో ఎత్తు. ఇలా ప్ర‌తీ అంశాన్ని కాఫీ కొట్టి కాఫీ చంద్ర‌బాబుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ విజ‌య‌సాయిరెడ్డి గ‌తంలో ట్వీట్ కూడా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here