ఎట్ట‌కేల‌కు “గంట” మోగింది.

41

ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్కంఠంగా మ‌రిన విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎట్ట‌కేల‌కు తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసిన గంటా శ్రీనివాస‌రావు గెలుపొందారు. 1902 ఓట్ల మెజార్టీతో ఆయ‌న గెలిచారని ఎన్నిక‌ల అధికారులు తాజాగా ప్ర‌క‌టించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కేకే రాజు రెండోస్థానంలో నిలిచారు. నిన్న ఎన్నిక‌ల కౌంటింగ్ సంద‌ర్భంగా విశాఖ‌ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ఈ వీఎంలు తెరుచుకోలేదు.

దీంతో అధికారులు వీవీ ప్యాడ్ స్లిప్పుల ఆధారంగా చేసుకుని కౌంటింగ్ చేసి ఫ‌లితాలను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ఓ వీవీ ప్యాడ్ మిష‌న్ లో 307 స్లిప్పుల‌కు గాను 106 స్లిప్పులు మాత్ర‌మే ఉన్నాయి. దీంతో వైసీపీ అభ్య‌ర్థి త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఎన్నికల స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల అధికారులతో కుమ్మ‌క్కు అయ్యార‌ని కేకే రాజు మండిప‌డ్డారు. స్లిప్పులు త‌క్కువ వ‌చ్చినందున అధికారులు ఆయా గ్రామాల్లో రీ పోలింగ్ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితాల‌ను అధికారులు పెండింగ్ లో ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here