రంగుల గురించి మనకు తెలియని 20 ఆసక్తికరమైన నిజాలు..!!

485

మన చుట్టూ ఉన్న కలర్స్ మనకు తెలియకుండానే మన జీవితాలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనకు నచ్చిన బట్టలు, కార్లు, పెంపుడు జంతువులు, మన శరీరంతో పాటు ప్రతిదీ ఎదో ఒక రంగు కలిగి ఉంటుంది… మనం ఎంచుకునే కలర్స్ కొన్ని సందర్భాలలో మన జీవితంపైన కూడా ప్రభావితం చూపిస్తాయి…కలర్స్ అనేవి ఒక అద్భుతమైన ప్రపంచం…అందులో మనకు తెలియని ఎన్నో వాస్తవాలు ఉన్నాయి…వాటిలో 25 వాస్తవాల గురించి తెలుసుకుందాం… అవి తెలుసుకున్న తర్వాత కలర్స్ పైన మీకు ఉండే అభిప్రాయంలో మార్పు వస్తుంది…

1 రాత్రి సమయంలో సాధారణ వ్యక్తులకు కనిపించే రంగు కంటే చూపు తక్కువగా ఉన్నవాళ్ళకి బాగా కనిపిస్తాయి…

2 . సిల్వర్ కలర్ కార్లు సురక్షితమైనవని మిగతా కలర్ కార్లతో పోలిస్తే సిల్వర్ కలర్ కార్లకి ప్రమాదాలు కూడా చాల తక్కువ ఒక శాస్త్రీయ అధ్యయనంలో రుజువుచేసారు…

3 . బ్లూ కలర్ మనసుకు ప్రశాంతతను కల్గిస్తుంది…దానితో పాటు హార్ట్ బీట్ ని తగ్గిస్తుంది, రక్తపోటు రాకుండా చేస్తుంది…

4. శిశువు చూసే మొదటి రంగు ఎరుపు…2 వారాల వయస్సులో ఉన్న శిశువులు అప్పటికే ఎరుపు రంగును వేరు చేయగలరని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

5. సగటు వ్యక్తి సుమారు ఒక మిలియన్ రంగులను చూడగలరు. అయితే, కొందరు వ్యక్తులు అంతకంటే ఎక్కువ రంగులు కూడా చూడగలరు.

6. పురాతన జపనీస్ భాష నీలం మరియు ఆకుపచ్చ రంగు మధ్య తేడాను గుర్తించలేదు. వాళ్ళు ఆ రెండింటిలో కలిపి “అఒ” అని పిలువబడే ఒక రంగును కలిగి ఉండేవారు.

7. విశ్వంలో ఉన్న అన్ని నక్షత్రాల వెలుగును తీసుకొని, వాటిని అన్ని ఒక పెట్టెలో పెట్టి కలిపి విశ్వం ఏ రంగులో ఉంటుందో కనుగొన్నారు ఖగోళశాస్త్రజ్ఞుల బృందం..విశ్వం లేత గోధుమరంగు ఉంటుందని తెలుసుకున్నారు…

8. నారింజ యూరోప్ లో ప్రాచుర్యం పొందటానికి ముందు, నారింజ రంగు యొక్క ఆంగ్ల పదం “జియోల్యుహెడ్” లేదా “పసుపు-ఎరుపు” రంగు . ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం, 1512 వరకు “నారింజ” అనే పదం రంగును వర్ణించడానికి ఉపయోగిస్తున్నారు…

9. ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన రంగు బ్లూ, ప్రపంచంలో దాదాపు 40% మంది బ్లూ రంగును ఇష్టపడతారు…

10. రంగులు కొంతమందికి భయపెట్టవచ్చు. ఈ రంగుల వాళ్ళ భయపడటం, విరక్తి చెందటం నిరంతరం జరుగుతూ ఉంటుంది.

11. పింక్ రంగు శాంతిని ప్రోత్సహిస్తుంది. వాస్తు శాస్త్ర మేధావి ఫెంగ్ షుయ్ ప్రకారం గదిలో పింక్ రంగు ఉంటె వివిధ రకాల శక్తులను రాకుండా చేసి శాంతిని కలిగిస్తుందని చెప్పాడు…

12. ఎరుపు మరియు పసుపు ఆకలి పుట్టించే రంగులు అని పరిశోధకులు చెబుతున్నారు. మెక్డొనాల్డ్, కె.ఎఫ్.సి. మరియు బర్గర్ కింగ్ లాంటి చాలా ఫాస్ట్ ఫుడ్ జెయింట్స్ లోగోలు ఈ రెండు రంగులలో ఎదో ఒక రంగులతో ఉంటుంది…

13. మన కన్ను కొన్ని రంగులను చూడటానికి కష్టంగా ఉంటుంది…అలంటి రంగులను చూడటానికి మనం ఇష్టపడము

14. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు టెలివిజన్ లో వచ్చే రంగులు మనం నిద్రపోయేటప్పుడు వచ్చే కలలో తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

15. తెలుపు రంగు స్పష్టత మరియు తాజాదనాన్ని సూచిస్తుంది. గదికి తెల్లటి పెయింట్ ఉంటె గర్భిణీ స్త్రీకి ఆదర్శంగా ఉంటుంది

16. మన కంప్యూటర్ బ్యాక్ గ్రౌండ్ ఆకుపచ్చ రంగు అయితే మంచిది ఎందుకంటే ఆ రంగు కళ్ళకు ఒత్తిడిని తగ్గిస్తుంది…

17. ఎరుపు రంగును మనం హెచ్చరికల కోసం ఉపయోగిస్తాం… ఎరుపు రంగు హాయిగా నిద్రపోవడానికి, కొన్ని సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది…

18. కొన్ని జీవులు, దోమలు డార్క్ కలర్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తాయి…నలుపు మరియు నీలం రంగులను ఆకర్షిస్తాయి…

19. అన్ని బాక్సులలో ఒకే బరువు ఉన్న, బ్లాక్ కలర్ బాక్స్ మాత్రం బరువు ఎక్కువగా ఉన్నటు అనిపిస్తుంది…

20. బూడిదరంగు మనుషుల మధ్య స్ఫూర్తినిచ్చి, వాళ్ళ మధ్య ఉండే బంధాన్ని విడదీయకుండా ఉండే శక్తిని కలిగిఉంటుంది…బూడిద రంగు వస్త్రాలు ధరించే వాళ్ళు ఈ రంగు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రకాశవంతమైన మరో రంగును కూడా వాడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here