అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబుకు జ‌గ‌న్ నిజంగానే సినిమా చూపించాడుగా

289

రెండోరోజు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు మొద‌ల‌య్యాయి. ఈ రోజు సున్నా వ‌డ్డీపై అసెంబ్లీలో వాడీ వేడిగా స‌మావేశాలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష చంద్ర‌బాబు నాయుడు పై మ‌రోసారి ఫైర్ అయ్యారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు చేసిన అక్ర‌మాల‌ను కూడా జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా స్క్రీన్ ద్వారా చూపించారు. అద్యక్షా… స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కేవ‌లం 23 మంది మాత్ర‌మే ఉన్నారు.

ఒక్క‌సారి మావాళ్లు లేస్తే టీడీపీ ఎమ్మెల్యే మ‌ళ్లీ కూర్చోలేర‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించారు. చంద్ర‌బాబు నాయుడు తాను ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్నార‌నే బ్రాంతిలో ఉన్నార‌ని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు .అద్యక్షా టీడీపీ నాయ‌కులు గ‌తంలో వ‌డ్డీ లేని రుణాల‌తో అక్క చెల్లెమ్మ‌ల‌ను మోసం చేశార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. 2014-15 సంవ‌త్స‌రానికి గాను 1186 కోట్లకు కేవ‌లం 44 కోట్లు మాత్ర‌మే ఇచ్చార‌ని అన్నారు. అలాగే 2015-16 సంవ‌త్స‌రాల‌కు గాను 2283 కోట్ల‌కు కేవ‌లం 31 కోట్లు మాత్ర‌మే ఇచ్చారు.

2016-17, 2304 కోట్ల‌కు టీడీపీ ప్ర‌భుత్వం ఇచ్చింది కేవ‌లం 240 కోట్లు
2017-18, 2703 కోట్ల‌కు టీడీపీ ప్ర‌భుత్వం ఇచ్చింది కేవ‌లం 182 కోట్లు
అలాగే 2018-19 సంవ‌త్స‌రానికి గాను కేవ‌లం 122 కోట్లను వ‌డ్డీలేని రుణాల‌ను ఇచ్చార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. దాంతోపాటు రైతుల‌కు 11595 కోట్ల రుణాలు వ‌డ్డీ లేకుండా ఇవ్వాల్సి ఉండ‌గా కేవ‌లం 639 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే చంద్ర‌బాబు నాయుడు ఇచ్చార‌ని జ‌గ‌న్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here