క‌థువా నింధితులే – దోషులు

269

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం రేపిన క‌థువా హ‌త్యాచార కేసులో పంజాబ్ లోని ప‌ఠాన్ కోట్ స్పెషల్ కోర్టు తీర్పును వెలువ‌రించింది. మొత్తం ఏడుగురు నిందితుల్లో సుమారు ఆరుగురిని దోషులుగా న్యాయ‌స్థానం తేల్చింది. గ్రామ పెద్ద సాంజీ సహా ఆరుగు దోషులుగా కోర్టు నిర్దారించింది. అలాగే సాంజీ రామ్ కుమారుడును నిర్దోషిగా నిర్థారించింది. ఈ నెల జూన్ మూడుతో ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ పూర్తి కాగా న్యాయ‌స్థానం ఇవాల తీర్పును ప్ర‌క‌టించింది.

కీల‌క కేసుకు సంబంధించిన తుది తీర్పు రానున్న నేపథ్యంలో ప‌ఠాన్ కోట్ డిస్టిక్ స్పెష‌న్ కోర్టు ముందు అధికారులు భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. న్యాయ‌స్థానం ముందు నింధితుల‌ను హాజరు ప‌రిచే స‌మ‌యంలో ఎలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకోకుండా భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. కాగా జ‌మ్మూలోని క‌థువా జిల్లాలో గ‌త ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో 8 సంవ‌త్స‌రాల బాలిక‌ను అత్యంత దారుణంగా ఆల‌యంలోనే అత్యాచారం చేశారు. ఈ సంఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది.

బాధితురాలికి మ‌త్తు ప‌దార్థం ఇచ్చి సామూహిక హాత్యాచారం, హ‌త్యాచారం చేశారు. అంతేకాదు ఆ బాలిక‌ను నాలుగు రోజుల పాటు గ్రాయంలోని ఓ దేవాల‌యంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగ‌ట్టారు. నాలుగు రోజులు త‌ర్వాత అత్యంత దారుణ ప‌రిస్థితిలో బాలిక మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింది. ఆ స‌మ‌యంలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాల‌ను తారు మారు చేశార‌నే ఉద్దేశంతో పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here