టీడీపీ ఓటమితో చాల సంతోషంగా ఉన్నా.. రాష్ట్రానికి పట్టిన పీడా పోయింది..!!

421

ఏపీ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడంపై వైకాపా మహిళా నేత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ప్రజలు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారనీ, ఈ ఫలితాలు చాలా సంతృప్తినిచ్చాయని చెప్పుకొచ్చారు. ఏపీలో రాజన్న రాజ్యం కోసం, సుపరిపాలన కోసం ఐదేళ్లు కష్టపడ్డామని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతులు అల్లాడిపోయారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చావేదికలో లక్ష్మీపార్వతి మాట్లాడారు.

చంద్రబాబు తన ఐదేళ్ల పదవీకాలంలో అబద్ధాలతో కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు కాకపోయినా ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు సహా సామాన్యులకు లబ్ధి కలిగేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాజన్న రాజ్యం తెస్తామన్న జగన్ తన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామ సెక్రటేరియట్ల ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here