కళ్యాణ్ రామ్ తో సూపర్ హిట్ భామా..!!

202

కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచయమైన మెహ్రీన్ కౌర్ ఈ సినిమా భారీ హిట్ కావడంతో ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ భావించారు, అయితే అలా అందరూ అనుకున్న‌ట్టే భారీ ఎత్తున అవకాశాలు కూడా పొందింది. అయితే త‌దుప‌రి సినిమాలేవి సరిగా ఆడకపోవడంతో పెద్దగా ఆఫర్స్ల్ లేకుండా పోయాయి ఈ పంజాబీ భామ‌కు. F2 సినిమా లో హీరోయిన్ గా నటించడంతో ఆమెకు టైం కలిసొచ్చింది, ఆ సినిమా హిట్ కావడంతో ఆమెకు తెలుగు తమిళ కన్నడ బాషలలో అవకాశాలు వచ్చాయట..

తాజాగా ఆమె కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడానికి ఓకే చెప్పేసింది.ప్రస్తుతం కల్యాణ్ రామ్ .. వేణు మల్లిడి దర్శకత్వంలో ‘తుగ్లక్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సతీశ్ వేగేశ్నతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసమే కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. ఇంతవరకూ సతీశ్ వేగేశ్న ‘శతమానం భవతి’ .. ‘ శ్రీనివాస కల్యాణం’ వంటి కుటుంబ కథాచిత్రాలనే తెరకెక్కించారు. ఇప్పుడు చేయనున్న సినిమా యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్ పాత్రకి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here