ఫోన్లు పేల‌కుండా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి?

521
ఇటీవ‌ల స్మార్ట్  ఫోన్లు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పేలిపోతూ యూజ‌ర్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.. అయితే ప్ర‌ముఖ కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.. ఫోన్లు మాట్లాడే స‌మ‌యం అలాగే చార్జింగ్ పెట్టే స‌మ‌యంలో పేలిపోవ‌డంతో చాలా మంది ప్రాణాలు కొల్పోతున్నారు..ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు.. జేబులో ఉన్న ఫోన్లు ఇలా వాటికి అవే పేలిపోతున్నాయి. అయితే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మొబైల్ ఫోన్లు పేలిపోయే స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు అంటున్నారు నిపుణులు ఓసారి అవేంటో చూద్దాం?ఝ‌
మొబైల్ పేలకుండా ఉండాలంటే ఎప్పుడైనా ఛార్జింగ్ 96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. 20 శాతం కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి. అలాగే మొబైల్‌కి పౌచ్ ఉంటే తీసేసి ఛార్జింగ్ పెట్టాలి. మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే 5 లేదా 10 నిమిషాల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టాలి.
మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వైఫై, హాట్ స్పాట్, సాంగ్స్, నెట్, కాల్స్, గేమ్స్ పొరపాటున కూడా వాడకూడదు. మొబైల్‌కి వచ్చిన ఛార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ ఛార్జర్‌ని కొనుక్కుని వాడాలి. 100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను వాడకూడదు.
ఇక కొన్ని అప్లికేష‌న్స్ కూడా అన‌వ‌స‌రం అనుకునేవి ప‌క్క‌న పెట్టాలి.మొబైల్ హీట్ గా ఉంటే ఆ ఫోన్ ను ఫ్యాంటు జేబులో పెట్టుకోకూడ‌దు….. మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్‌లో మొబైల్‌ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఉంది. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అయితే వెంటనే స్విచ్ ఆఫ్‌ చేసి చల్లబడ్డాక ఆన్ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here