ఏపీ కేబినెట్ లో స్థానం దక్కకపోవడంపై రోజా స్పందన..!!

278

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి లభిస్తుందని ఆ పార్టీ నేతలు సహా చాలా మంది ఊహించిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ కేబినెట్ లో ఆమెకు స్థానం దక్కలేదు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈరోజు విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా పలకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు కదా, ఆ సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవికి తనకు రాలేదేమోనని అభిప్రాయపడ్డారు.

ఐతే కాకుండా ‘జగన్ గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్పగలను?’ అంటూ నవ్వులు చిందించారు. మీకు మంత్రి పదవి దక్కలేదు కనుక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు రోజా స్పందిస్తూ, ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు నుంచి ఇప్పటికే ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులను ఛానెల్స్ వాళ్లు తనకు ఇచ్చేశారని, ఇక, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారని ఛలోక్తి విసిరారు.ఇటీవల జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రోజా హాజరుకాకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేల హాజరు అవసరం లేదని, అందుకే, హాజరు కాలేదని స్పష్టం చేశారు. మంత్రి పదవులు దక్కించుకున్నవారికి రోజా శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here