జ‌గ‌న్ ను ఎందుకు పొడిచాడో బ‌య‌ట పెట్టిన శ్రీనివాస్

19

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై కొద్ది రోజుల క్రితం కోడిక‌త్తితో దాడి చేసిన శ్రీనివాస రావు కు తాజాగా కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇటీవ‌లే విజ‌య‌వాడ ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ రావుకు ఆనారోగ్య కార‌ణాల‌తో బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయ‌న్నురాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్ నుంచి విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత శ్రీనివాస‌రావు మీడియాతో మాట్లాడుతూ… ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్ మోహ‌న్రెడ్డిపై తాను హ‌త్యాయ‌త్నం చేయ‌లేద‌ని అన్నారు. తాను జ‌గ‌న్ ను క‌ల‌వాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్తే చేతిలో ఉన్న క‌త్తి పొర‌పాటున ఆయ‌న భూజానికి త‌గిలింద‌ని అన్నారు. విశాఖ విమానాశ్ర‌యంలో తాను వంట మాస్ట‌ర్ గా ప‌ని చేస్తున్నాన‌ని  జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి విమానాశ్ర‌యం నుంచి హైద‌రాబాద్ కు వెళ్లే స‌మ‌యంలో తాను ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వివ‌రించేందుకు  వెళ్లాన‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here