తనుశ్రీ దత్తా కి సాక్ష్యాలు లేవు.. అయినా వెనక్కి తగ్గదటా..!!

44

మీటూ ఉద్యమం ఇప్పుడు బాలివుడ్, టాలివుడ్ ఇండస్ట్రీ ల్లో ఒక రేంజ్ లో ఉంది. హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం బాలీవుడ్, టాలీవుడ్ లకు పాకింది. బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా.. నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన తన ఇమేజ్ దెబ్బతినేలా తనూ శ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేసిందని ఆవేదన చెందారు. ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లో చెప్పారు. తాజాగా తనుశ్రీ దత్తా నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణల కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని ముంబయి పోలీసులు వెల్లడించారు.

2008లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ అనే చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటిస్తున్నప్పుడు పటేకర్‌ తన చెయ్యి పట్టుకుని లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించారు.సినిమా చిత్రీకరణ సమయంలో ఉన్నవారిలో దాదాపు 15 మందిని పోలీసులు విచారించారు. అయితే పదేళ్ల క్రితం జరిగిపోయిన విషయం కావడంతో ఎవ్వరికీ ఏమీ గుర్తులేదని చెప్పారట. దాంతో సాక్ష్యాలేవీ దొరక్కపోవడంతో విచారణ కొనసాగించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. కానీ తనుశ్రీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.. సాక్షులను బెదిరిపులకు గురిచేస్తున్నారని తనకు ఎప్పటికైన శిక్ష పడుతుందని నమ్మకంగా అంటుంది తను శ్రీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here