నెల్లూరులో మంత్రి రేసులో ఉన్న వారు వీరే

22

2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లా ఫ‌లితాలు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. మాజీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు స‌న్నిహితులు ఈ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా గెలుస్తారన్న స్థానాల్లో కూడా వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. ఈ ఎన్నిక‌ల్లో అసెంబ్లీ స‌హా పార్ల‌మెంట్ స్థానాల‌ను మొత్తం వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో జిల్లాలో మంత్రి ప‌ద‌వుల‌కోసం వైసీపీ ఎమ్మెల్యేల ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి.

మంత్రివ‌ర్గంకు ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు ఇప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాట‌. అంతేకాదు ప‌లువురు పేర్లు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. సామాజిక ప్రాతిప‌దిక‌న చూస్తే మంత్రిప‌దవి ఎవ‌రికి వ‌రిస్తున్న చ‌ర్చ మ‌రింత‌ వేడిక్కిస్తోంది. ప్ర‌ధానంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఏడుమంది వైసీపీ అభ్య‌ర్థులు ఈ ఎన్నికల్లో గెలిచారు. వీరిలో సీనియ‌ర్స్ కు త‌ప్ప‌ని స‌రిగా మంత్రి ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

మంత్రి ప‌ద‌విలో తెర‌పైకి వ‌చ్చిన పేర్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్, ఆత్మ‌కూరు ఎమ్మెల్యే మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి, అలాగే వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి. సుళ్లురు పేట వైసీపీ ఎమ్మెల్యే సంజీవ‌య్య పేర్లు వినిపిస్తున్నాయి. వీరంద‌రు జ‌గ‌న్ కేబినెట్ లో పని చేయాల‌ని చూస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ వీరిలో ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here