చంద్ర‌బాబుకు జ‌గ‌న్ కు మ‌ధ్య తేడా ఇదే

172

కొద్దికాలంగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి త‌న నివాసంలో రాష్ట్ర స‌మాచారాన్ని తెలుసుకునేందుకు సమీక్షా సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. స‌మావేశంలో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న తీరుపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. ఏ విషయమైనా గంటల్లో తేల్చేస్తున్నారు. వారందరికీ లంచ్‌ సీఎం గారింట్లోనే. తన కోసం తయారు చేసిందే అందరికీ పెట్టాలని చెప్పడం, తమతో వ్యవహరించే తీరు ఆయన గొప్ప సంస్కారాన్ని చాటుతున్నాయని అధికారులు చెప్పుకుంటున్నారని విజ‌యసాయి రెడ్డి ట్వీట్ చేశారు. గ‌త ముఖ్య‌మంత్రికి ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి తేడా చాలా ఉంద‌ని అంటున్నారి పేర్కొన్నారు

మ‌రో ట్వీట్ చేస్తూ

ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి ఒకే సారి 10 వేలకు పెంచి వైఎస్ జగన్ 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు. అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు (ఆశా) సోదరీమణులపై చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. అరెస్టులు చేసి హింసలు పెట్టారని అన్నారు.

ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడింది. నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారు. దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్ చేశారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here