జ‌గ‌న్ న‌వ్వుల‌పై వ‌ర్మ సంచ‌ల‌న ట్వీట్

441

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మకు చెందిన విల‌క్ష‌ణ ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్ప‌టి క‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటారు. నిత్యం క‌రెంట్ ఇష్యూష్ ల‌పై కామెంట్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంటారు వ‌ర్మ‌. అయితే ఆయ‌న కేవ‌లం ఫిలిమ్ కు సంబంధించిన విష‌యాలపైనే కాకుండా అప్పుడ‌ప్పుడు ఏపీ రాజ‌కీయాల‌పై కూడా వ‌ర్మ ట్వీట్ చేస్తుంటారు.

అయితే ఇదే క్ర‌మంలో మ‌రో ట్వీట్ చేశారు ఆయ‌న. నేడు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్న‌ నేప‌థ్యంలో వ‌ర్మ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ట్వీట్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ స‌మావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడిన ప్ర‌తీ సారీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వ్వుల్లో మునిగి పోతున్నార‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు.

సినిమా తెర‌పై ప్ర‌ముఖ న‌టుడు ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం వ‌చ్చినప్పుడు మాత్ర‌మే జ‌నాలు ఇలా న‌వ్వ‌డాన్ని తాను చూశాన‌ని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో టీడీపీ కామెడీ ట్రాక్ గా మారింద‌ని వ‌ర్మ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here