ఆహరంలో రుచి కోసం వెల్లుల్లిని వాడుతూ ఉంటాం కానీ అదే వెల్లుల్లి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు!!

1256
# వెల్లుల్లిలో ఒక రకమైన ఘాటు వాసన ఉంటుంది కదా. అసలు అది ఎలా వస్తుందో తెలుసా? అందులో ఉండే గంధక రసాయనాల వలన వస్తుంది. రక్త నాళాల్లో గార పేరుకోకుండా చేయటం వీటి పని.. దీనిలోని అజోయేన్ రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది.
# కొంతమందికి తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది, అలంటి వారు వెల్లుల్లిని ఏదొక విధంగా రోజూ తీసుకుంటుంటే ఫలితం ఉంటుంది.
# యాంటీబ్యాక్టీరియాల్, యాంటివైరల్, యాంటీఫంగల్ గా పని చేసే అలిసిన్ వెల్లులిలో పుష్కలంగా ఉంటుంది. ఇది ఎటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తనాళాలను ముడుచుకుపోయేలా చేసే యాంజియోటెన్సిన్ అనే ప్రోటీన్ పని తీరును అడ్డుకుంటుంది.రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది.
# శరీరం ఇనుమును గ్రహించుకునేలా చేసే ఫెర్రోపోర్టిన్ అనే ప్రోటీన్ ను వెల్లుల్లిలోని డయాలిల్ సల్ఫయిడ్లు ఉత్పత్తి చేస్తాయి.. ఈ ప్రోటీన్లు ఇనుము సంబంధ జీవక్రియలు మరింత మెరుగ్గా సాగటానికి తోడ్పడతాయి.
# వెల్లుల్లి వాపులు నివారించటంలోనూ, కొన్ని రకాల కాన్సర్ నివారణకు తోడ్పడుతుంది.
# ఇది వాడటం వలన గుండె సంబంధిత వ్యాధులు తగ్గించి కాలేయ మరియు మూత్రాశయాల పని తీరును మెరుగు పరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here