షాకింగ్ బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే నిజ‌మేనా…

737

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆప‌రేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. రానున్న రోజుల్లో ఏపీలో త‌మ ప‌ట్టు సాధించుకోవాల‌నే ఉద్దేశంతో సీనియ‌ర్స్, జూనియ‌ర్స్ అన్న తేడా లేకుండా ప్ర‌తీ ఒక్క‌రికి బీజేపీ వెల్ క‌మ్ సాంగ్ ప్లే చేస్తోంది. అంతేకాదు గ్రామ‌స్థాయి లీడ‌ర్లను కూడా వ‌ద‌ల కుండా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఏపీలో బీజేపీకి ప్ర‌స్తుతం బ‌ల‌మైన నాయ‌కుడు కాదు కావాల్సింది ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు రానున్న రోజుల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌బోతున్నామ‌ని నిరూపించుకోవ‌డానికి ఈ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవ‌లే ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో పాటు మాజీ టీడీపీ ఎమ్మెల్యేను కూడా బీజేపీలో చేర్చుకుంది అధిష్టానం. అందులో ఇద్ద‌రు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితులుగా ఉన్నవారు కూడా బీజేపీ తీర్ధం తీసుకోవ‌డం అంద‌రిని ఆశ్చార్యానికి గురి చేస్తోంది.

అయితే ఇప్పుడు ఎవ్వ‌రు ఊహించ‌ని విధంగా బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత‌ల‌ను ఫోక‌స్ చేస్తున్నట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో ముందుగా ఉత్త‌రాంధ్రకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేపై క‌మ‌లం నేత‌లు ఫోక‌స్ పెట్టార‌ట‌. ఈ క్ర‌మంలో ఆయ‌న్ను బీజేపీలో చేర్చుకునేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ట. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం తాను వైసీపీని వ‌దిలి ఎక్క‌డ‌కు వెళ్ల‌ల‌ని అంటున్నార‌ట‌. గ‌తంలో ఈయ‌న‌కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అందరు భావించారు.కానీ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం ఆ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన మంత్రి ప‌ద‌విని వేరే వారికి ఇచ్చారు. దీంతో ఆయ‌న కొన్ని రోజులు అసంతృప్తి చెందారు. ఆ త‌ర్వాత అధిష్టానం ఆయ‌న‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చింది.

అయితే బీజేపీ మాత్రం ఆయ‌న్ను వ‌ద‌ల‌కుంద‌ట. ఎందుకంటే ఉత్త‌రాంధ్ర‌లో ఆ వైసీపీ ఎమ్మెల్యే బ‌ల‌మైన నేత కావ‌డంతో ఆయ‌న‌పై బీజేపీ ఫోక‌స్ చేస్తోంది. ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుంటే విశాఖ జిల్లోలో పార్టీకి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని భావిస్తోంద‌ట‌. పైగా కేంద్ర ప్ర‌భుత్వం కూడా ముందుగా విశాఖ‌లో త‌మ గ్రిప్ ను పెంచుకోవాల‌ని చూస్తోంది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేను బీజేపీలో చేర్చుకోవాల‌ని చుస్తోందట‌. అయితే ఆయ‌న పార్టీలో చేరిక‌కు ఏపీ బీజేపీ నాయ‌కులు స‌సేమిరా అంటున్నార‌ట‌. ఒక వేళ ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుంటే జిల్లాలో త‌మ‌ప‌ట్టు త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఆయ‌న్ను చేర్చుకోవాల‌ని చూస్తోంద‌ట‌. పైగా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే వ‌స్తే అది రాష్ట్రం మొత్తం సంచ‌ల‌నంగా మారే ఆస్కారం ఉంద‌ని గ్రహిస్తోంద‌ట అధిష్టానం. మ‌రి చూడాలి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు ఎంత‌మేర‌కు నిజం అవుతాయో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here