వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా

1856

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో పార్టీ అఖండ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాల‌కు వైసీపీ 151 స్థానాల‌ను గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో పార్టీ కేవ‌లం 23 స్ధానాల‌ను మాత్ర‌మే గెలుచుకుంది. ఇక జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా డిపాజిట్లు కోల్పోయారు.

రాజ‌కీయాల్లో మార్పు తీసుకువ‌స్తానని చెప్పిన జ‌న‌సేనాని కేవ‌లం ఒక్క‌సీటుకు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. ఇక పార్ల‌మెంట్ స్థానాల్లో కూడా వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేసేశారు. అవును మీరు విన్న‌ది నిజ‌మే హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

భార‌త రాజ్యాంగం ప్ర‌కారం ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా ఎలాంటి ప్ర‌భుత్వ ప‌ద‌వుల్లో ఉండ‌కూడ‌దు. అంతేకాదు రాజ‌కీయ‌ ప‌ద‌వుల్లో ఉన్న‌వారు కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలి. అందుకే విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యేగా గెలిచిన వీర‌భ‌ద్ర‌రావు త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ రోజు అయ‌న శాస‌నస‌భ కార్య‌ద‌ర్శి కే స‌త్య‌నారాయ‌ణ రావుకు త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here