నెరవేరిన సీఎం జగన్ హామీ.. జీవో పాస్ చేసిన జగన్..!!

79

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మే 30వ తేదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచే కాకుండా, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా పలువురు రాజకీయ నేతలు, అభిమానులు విచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తదితరులు హాజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్‌ తొలిసారిగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు..

ఇదిలా ఉంటె గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పెరు మార్చి.. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 2250 రూపాయలకు పెన్షన్ జూన్ నుంచి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జులై 1 నుండి కొత్త పెన్షన్ పథకం అమలుకానుంది. వికలాంగులకు రూ. 3000, కిడ్నీ బాధితులకు రూ. 10000 పెన్షన్ అందిస్తోంది. వృద్ధులకు పెన్షన్ వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కుదించారు.

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకాంర చేసిన జగన్ తన తొలి సంతకం అవ్వతాత పెన్షన్ పెంపుదలపై చేశారు. ఇప్పటవరకు వృద్ధాప్య ఫించన్లు వెయ్యి రూపాయలుగా ఉన్నాయన్నారు. ఇక నుంచి వాటిని 2250 రూపాయలకు పెంచుతూ అందిస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ప్రతీ ఒక్క పథకాన్ని అమలు చేస్తామన్నారు జగన్. వైఎస్ఆర్ పెన్షన్ అంటూ నామకరణం చేస్తూ… వృద్ధాప్య ఫించన్ల ఫైలుపై జగన్ సీఎంగా తొలి సంతకం చేశారు. పెన్షన్ ప్రతీ సంవత్సరం రూ. 250 పెంచుతానని హామీ ఇచ్చారు. జూన్ నెల నుంచి ప్రతీ ఒకరు రూ. 2250లు పెన్షన్ తీసుకోవచ్చన్నారు.

కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పెన్షన్లు అందిస్తామన్నారు. తన మేనిఫెస్టోలో కులానికి ఓ పేజీ తీసుకోరాలేదన్నారు. కేవలం రెండు పేజీలతోనే తన పార్టీ మేనిఫెస్టో తీసుకువచ్చిందన్నారు. నాలుగేళ్లలో వృద్ధాప్య పెన్షన్లు రూ.3వేలు చేస్తామన్నారు. పార్టీలకతీతంగా పెన్షన్లను అమలు చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here