వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు వేగ‌వంతం- టీడీపీలో టెన్ష‌న్

1869

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసును పోలీస్ అధికారులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. గ‌తంలో ఈ హ‌త్య‌కేసులో సాక్షాల‌ను తారుమారు చేశార‌నే అభియోగంపై నిందితులు ఎర్ర‌గంగి రెడ్డి, కృష్ణారెడ్డి, ప్ర‌కాశ్ ల‌ను పులివెందుల కోర్టులో హాజ‌రు ప‌రిచారు. దీంతో న్యాయ‌స్థానం వారికి ఈ నెల 17 వ‌ర‌కు రిమాండ్ విదించింది. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించిన ప‌లు కీల‌క అధారాల‌ను సేక‌రిందించి సిట్.

మార్చి 15న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించింది. మొద‌ట గుండెపోటుతో వివేకానంద‌రెడ్డి మృతి చెందార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. అయితే ఆయ‌న శ‌రీరంపై గాయాలు ఉండ‌టంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసి పోస్ట్ మార్టానికి త‌ర‌లించారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హత్యా అని తేలడంతో రాజకీయంగా ర‌చ్చ మొద‌ల‌వ్వ‌డంతో అప్ప‌టి ప్ర‌భుత్వం ఈ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రించేందుకు సిట్ ను నియ‌మించింది. అయితే దీనిపై జ‌గ‌న్ త‌మ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కాగా వివేకానంద‌రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మంత్రిగా, ఎంపీగా ఎమ్మెల్యేగా ప్ర‌జల‌కు సేవ‌లు అందించారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి ఆగ‌స్ట్ 8 1950లో పులివెందుల‌లో జ‌న్మించారు.

వైఎస్సార్ కు వివేకా చిన్న త‌మ్ముడు. ఆయ‌న తిరుప‌తిలోని ఎస్వీ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ చ‌దివారు. 1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here