పుట్టింది అలానే చ‌నిపోయేది కూడా అలానే- జ‌గ‌న్ బందువు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

1325

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చైర్మ‌న్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును ప్ర‌క‌టించారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అధికార ఉత్త‌ర్వులు రాక‌పోయినప్ప‌టికీ టీటీడీ విష‌యంలో ముఖ్య‌మంత్రి నిర్ణ‌య‌మే ఫైనల్. అయితే వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదంటూ సోష‌ల్ మీడియ‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

హిందువు కానీ వ్య‌క్తికి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని ఎలా ఇస్తారంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో పీక్స్ స్టేజ్ కు చేరుకోవ‌డంతో ఈ విష‌యంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తాను హిందువును కాదంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆయ‌న మండిప‌డ్డారు. కొంద‌రు కావాల‌నే త‌న‌పై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని వైవీ అరోపించారు.

తాను చిన్న‌ప్ప‌టినుంచి వెంక‌టేశ్వ‌ర స్వామిని పూజిస్తాన‌ని త‌న ఇష్ట దైవం వెంక‌న్నేన‌ని ఆయ‌న అన్నారు. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీటీడీ చైర్మ‌న్ గా త‌న‌ను ప్ర‌తిపాదించ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని స్ఫ‌ష్టం చేశారు వైవీసుబ్బారెడ్డి. అంతేకాదు త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని బాధ్య‌తా యుతంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని అన్నారు. తాను పుట్టిందే హిందువుగా అని చ‌నిపోవ‌డంకూడా హిందుగానే చ‌నిపోతాన‌ని స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here